2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2025 జూన్‌లో అంచనా వేసిన 6.3 శాతం వృద్ధిని 0.9 శాతం మేర పెంచింది. దేశీయ గిరాకీ బలంగా పుంజుకోవడం, ప్రభుత్వం తీసుకొచ్చిన పన్ను సంస్కరణలు వృద్ధి పెరిగేందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు నెమ్మదించి 6.5 శాతానికి పరిమితం కావొచ్చని అంచనా వేసింది.