ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో భారత జీడీపీ వృద్ధి 7.2 శాతంగా నమోదు కావొచ్చని ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన 6.5 శాతాన్ని గణనీయంగా పెంచింది. ద్రవ్యోల్బణ అంచనాను కూడా 3.1% నుంచి 2.6 శాతానికి ఏడీబీ సవరించింది. ఇటీవలి జీఎస్‌టీ రేట్ల కోతలు.. దేశీయ వినియోగం, వృద్ధికి మద్దతు ఇస్తాయని తెలిపింది.