Published on Jun 11, 2025
Current Affairs
2025-26లో భారత వృద్ధి 6.3%
2025-26లో భారత వృద్ధి 6.3%

దేశ వృద్ధి రేటు 2025-26లో 6.3 శాతంగా నమోదు కావొచ్చని ప్రపంచబ్యాంక్‌ అంచనా వేసింది.

అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో ఎగుమతులపై ఒత్తిడి పడే అవకాశం ఉన్నా, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలుస్తుందని బ్యాంక్‌ తెలిపింది. 

6.7% వృద్ధిరేటు లభించొచ్చని 2025, జనవరిలో అంచనా వేసిన ప్రపంచ బ్యాంక్, ఏప్రిల్‌లో దాన్ని 6.3 శాతానికి కుదించింది.

తాజాగా రూపొందించిన ‘గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్టస్‌’ నివేదికలోనూ అదే స్థాయి వద్ద ఉంచింది.

2026-27లో భారత వృద్ధి రేటు 6.5 శాతంగా నమోదు కావొచ్చని పేర్కొంది.