Published on Aug 14, 2025
Current Affairs
2025-26లో ద్రవ్యోల్బణం 3.5%
2025-26లో ద్రవ్యోల్బణం 3.5%

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం 3.5 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేసింది.

2024-25లో ఇది 4.6 శాతంగా నమోదయ్యింది.

ఈసారి ఆహార ఉత్పత్తుల దిగుబడి మెరుగ్గా ఉండనుండటంతో ద్రవ్యోల్బణం అదుపులోకి రావొచ్చని తన పరిశోధనా నివేదికలో తెలిపింది. 

మొత్తం మీద రెపో రేటును ఇప్పటివరకు ఆర్‌బీఐ 100 బేసిస్‌ పాయింట్లను ఆర్‌బీఐ తగ్గించింది.

ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో మరోమారు కీలక రేట్లను ఆర్‌బీఐ తగ్గించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది.