ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో ద్రవ్యోల్బణం 3.2 శాతంగా నమోదు కావొచ్చని రిసెర్చ్ అండ్ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది.
గతంలో అంచనా వేసిన 3.5 శాతం నుంచి 3.2 శాతానికి కుదించింది.
వినియోగదారు ధరల ఆధారిత సూచీ (సీపీఐ) ద్రవ్యోల్బణం 140 బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.
దీంతో ద్రవ్య పరపతి విధానాన్ని సులభతరం చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.
2025 ఆగస్టులో సీపీఐ ద్రవ్యోల్బణం 2.1 శాతంగా నమోదైంది. జులైలో ఇది 1.6 శాతంగా ఉంది.