148 ఏళ్ల తర్వాత తొలిసారి లైన్ జడ్జిలు లేకుండానే 2025 వింబుల్డన్ టోర్నీని నిర్వహిస్తున్నారు.
వారి స్థానంలో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్‌ను ప్రవేశపెట్టారు.
కోర్టులో బంతి ఎక్కడ పడిందో ఈ వ్యవస్థ గుర్తిస్తుంది.
కోర్టు దాటితే దీనిలో ఉండే మోనోటోన్ ‘ఔట్’ అని చెబుతుంది.
ఇందుకోసం వింబుల్డన్ కోర్టుల్లో 450పైనే కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్లో ఎలక్ట్రానిక్ లైన్ కాలింగ్ అమలవుతోంది.
2021లోనే ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఈ పద్ధతిని ప్రవేశపెట్టగా.. 2024లో యుఎస్ ఓపెన్లోనూ అరంగేట్రం చేసింది.
మట్టి కోర్టుల్లో ఆడే ఫ్రెంచ్ ఓపెన్లో లైన్ జడ్జిలే బాధ్యతలు నిర్వహిస్తున్నారు.