భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో జపనీస్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ నొమురా కోత విధించింది. 2025 ఏడాదికి జీడీపీ వృద్ధి అంచనాను 10 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.9 శాతానికి పరిమితం చేసింది. 2024లో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదైంది. అయితే అమెరికా టారిఫ్‌ల వల్ల భారత్‌పై పెద్దగా ప్రభావం ఉండదని నొమురా పేర్కొంది. 2026లో భారత జీడీపీ 7% వృద్ధి చెందొచ్చని అంచనా వేసింది.