Published on Feb 21, 2025
Current Affairs
2025లో జీడీపీ వృద్ధి 6.4 శాతం
2025లో జీడీపీ వృద్ధి 6.4 శాతం

2025లో భారత జీడీపీ వృద్ధి 6.4 శాతంగా ఉండొచ్చని మూడీస్‌ అనలిటిక్స్‌ అంచనా వేసింది. 2024లో జీడీపీ వృద్ధి 6.6 శాతంగా ఉంది.

అమెరికా టారిఫ్‌ల ప్రకటనకు తోడు అంతర్జాతీయంగా ఎగుమతులకు గిరాకీ తగ్గొచ్చన్న అంచనాలు ఇందుకు కారణమని తెలిపింది.

‘ఆసియా-పసిఫిక్‌ ఔట్‌లుక్‌: చావోస్‌ ఎహెడ్‌’ పేరిట మూడీస్‌ ఈ నివేదికను వెలువరించింది. వాణిజ్య ఉద్రిక్తతలు, విధానపరమైన మార్పుల కారణంగా ఆసియా-పసిఫిక్‌ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది నెమ్మదించొచ్చని వివరించింది.