Published on Sep 25, 2024
Current Affairs
2024-25లో 6.8% వృద్ధి
2024-25లో 6.8% వృద్ధి

ఈ ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్ధి రేటు 6.8 శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌ అండ్‌ పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 2024, సెప్టెంబరు 24న అంచనా వేసింది. 2025-26లో వృద్ధి రేటు 6.9 శాతానికి చేరొచ్చని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో దేశ ఆర్థిక వ్యవస్థ 8.2% వృద్ధి సాధించింది. 

2024-25లో ద్రవ్యోల్బణం సరాసరిన 4.5 శాతంగా నమోదు కావొచ్చని ఎస్‌ అండ్‌ పీ అంచనా వేసింది.