ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 6.6 శాతంగా నమోదవుతుందని ఆర్‌బీఐ నివేదిక అంచనా వేసింది.
డిసెంబరు నెల ఆర్థిక స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్)ను ఆర్‌బీఐ 2024, డిసెంబరు 30న విడుదల చేసింది.
దీని ప్రకారం, బలమైన లాభదాయకత, తగ్గుతున్న నిరర్థక ఆస్తులు, మూలధన, ద్రవ్యలభ్యత నిల్వలతో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు(ఎస్‌సీబీలు) కనిపిస్తున్నాయి.