Please note, our website will be undergoing scheduled maintenance on Monday, 25th November night from 11:00 PM to 3:00 AM IST (5:30 PM to 9:30 PM UTC) and will be temporarily unavailable. Sorry for the inconvenience.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారతదేశ వృద్ధి రేటును మోర్గాన్ స్టాన్లీ 6.7 శాతానికి పరిమితం చేసింది. గతంలో అంచనా వేసిన 7% నుంచి 0.3% తగ్గించింది.
జులై-సెప్టెంబరులో అంచనా వేసిన దాని కంటే బలహీన గణాంకాలు నమోదు కానుండటంతోనే, మొత్తం ఆర్థిక సంవత్సరానికి అంచనాలను తగ్గించినట్లు పేర్కొంది.
2025-26, 2026-27 ఆర్థిక సంవత్సరాల్లో 6.5% వృద్ధి రేటు అంచనాలను మాత్రం మార్పు చేయకుండా స్థిరంగా ఉంచింది. ద్రవ్యోల్బణం 2024-25లో 4.9%, 2025-26లో 4.3% నమోదు కావొచ్చని అంచనా వేసింది.