Published on Dec 10, 2024
Current Affairs
2024 అత్యంత వేడి సంవత్సరం!
2024 అత్యంత వేడి సంవత్సరం!

అత్యంత వేడి సంవత్సరంగా 2024 నమోదు కానుందని ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్‌ 2024, డిసెంబరు 9న తెలిపింది.

అలాగే సగటు ఉష్ణోగ్రత 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువగా నమోదు కావడం కూడా ఇదే తొలిసారి అని వెల్లడించింది.

2024 నవంబరు (2023 నవంబరు తర్వాత) కూడా రెండో అత్యంత వేడి నెలగా నిలిచిందని పేర్కొంది.

నవంబరులో ఉపరితల గాలి సగటు ఉష్ణోగ్రత 14.10 డిగ్రీల సెల్సియస్‌గా ఉందని, అది 1991-2020 సగటు కన్నా 0.73 డిగ్రీల సెల్సియస్‌ అధికమని చెప్పింది. 

అలాగే గ్లోబల్‌ వార్మింగ్‌లో కూడా 2024 నవంబరు రికార్డు సృష్టించిందని, ఈ నెలలో పారిశ్రామికీకరణ ముందు స్థాయి కంటే 1.62 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదయిందని వివరించింది.