Published on Jan 2, 2025
Current Affairs
2024 అత్యంత వేడి సంవత్సరం
2024 అత్యంత వేడి సంవత్సరం

భారతదేశంలో 1901 నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే 2024 అత్యంత వేడి సంవత్సరంగా నిలిచిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.

ఈ 123 ఏళ్ల ఉష్ణోగ్రతల సగటు కంటే 2024లో 0.90 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా నమోదైందని ఐఎండీ వివరించింది.

ఇప్పటివరకు అత్యధిక వేడి సంవత్సరంగా 2016 ఉంది. ఆ రికార్డును ఇప్పుడు 2024 బద్దలుకొట్టింది.