Published on Oct 23, 2024
Current Affairs
2024లో భారత వృద్ధి 7%
2024లో భారత వృద్ధి 7%

భారత వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) 8.2% అయినా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2024-25) 7 శాతానికి పరిమితం కావొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్‌) అంచనా వేస్తోంది.

వచ్చే సంవత్సరం (2025)లో 6.5% వృద్ధి రేటు నమోదు చేయొచ్చని పేర్కొంది. తన వార్షిక ‘వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌’ నివేదికలో ఐఎమ్‌ఎఫ్‌ ఈ విషయాలు పేర్కొది.

2022 మూడో త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 9.4% వద్ద గరిష్ఠ స్థాయికి చేరింది. 2025 చివరకు ఇది 3.5 శాతానికి పరిమితం కావొచ్చు. 2000-2019 సగటు అయిన 3.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువ.