Published on Jan 2, 2025
Current Affairs
2023-24 యూడైస్‌ నివేదిక
2023-24 యూడైస్‌ నివేదిక

ఒకటి నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరం ఏకీకృత జిల్లా పాఠశాల విద్యా సమాచారం (యూడైస్‌) గణాంకాలను కేంద్ర విద్యాశాఖ ఇటీవల విడుదల చేసింది.

ఒక్క విద్యార్థీ లేని అత్యధిక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలున్న రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్‌ (3,254), రాజస్థాన్‌ (2,187), తెలంగాణ (2,097) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

దేశవ్యాప్తంగా విద్యార్థులు లేని పాఠశాలలు 12,954 ఉన్నట్లు నివేదిక తెలిపింది. 

తెలంగాణలోని 2,097 ‘జీరో పాఠశాలల్లో’ 2 వేల మంది టీచర్లు పనిచేస్తున్నారు. కాకపోతే విద్యాశాఖ వారిని సమీప బడుల్లో డిప్యుటేషన్‌పై నియమిస్తుంది.

అంతకుముందు సంవత్సరం (2022-23)లో తెలంగాణలో విద్యార్థులు లేని బడుల సంఖ్య 1,672.