ప్రపంచంలో మానవ, పారిశ్రామిక కార్యకలాపాలతో పాటు వృక్ష సంపద ఆహుతవ్వడం, శిలాజ ఇంధన పెరుగుదల లాంటి కారణాలతో గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల స్థాయిలు 2023లో రికార్డు స్థాయిలో పెరిగాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నివేదిక పేర్కొంది. కేవలం రెండు దశాబ్దాల్లోనే గ్రీన్‌హౌస్ వాయువుల సాంద్రత 10 శాతానికి పైగా పెరిగినట్లు తెలిపింది.
డబ్ల్యూఎంవోకు చెందిన వార్షిక గ్రీన్‌హౌస్ గ్యాస్ బులెటిన్ ప్రకారం 2004లో ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డైఆక్సైడ్ ఉపరితల సాంద్రత 377.1 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉండగా అది 2023 నాటికి 420 పీపీఎంకు పెరిగినట్లు గ్లోబల్ అట్మాస్ఫియర్ వాచ్ నెట్‌వర్క్ ఆఫ్ మానిటరింగ్ స్టేషన్‌లు గుర్తించాయి.