16 ఏళ్లు లోపువారికి సామాజిక మాధ్యమాలు అందుబాటులో ఉండకుండా ప్రపంచంలోనే ప్రప్రథమంగా చట్టం తీసుకొస్తున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ ప్రకటించారు.
బాలల భద్రత కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని వివరించారు. ఈ చట్టానికి ఆస్ట్రేలియా ప్రధాన ప్రతిపక్షం కూడా మద్దతు తెలిపింది.
నవంబరు 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల చివరి రెండు వారాల్లో ఈ చట్టాన్ని చేస్తామనీ, ఆ తరవాత 12 నెలలకు వయోపరిమితి అమలులోకి వస్తుందని అల్బనీస్ తెలిపారు.