- కేంద్ర వనరుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే వాటాను 15వ ఆర్థిక సంఘం తరహాలోనే 41 శాతంగా 16వ ఆర్థిక సంఘం ఖరారు చేసింది. అయితే ఇతర గ్రాంట్లలో కోతపెట్టింది. రెవెన్యూ లోటును ఎదుర్కొంటున్న రాష్ట్రాల ఆర్థిక భారాన్ని పూడ్చేందుకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన గ్రాంట్లను 16వ ఆర్థిక సంఘం పూర్తిగా పక్కనబెట్టింది.
- దీనికితోడు రంగాలవారీ, రాష్ట్రాల ప్రత్యేక గ్రాంట్లకూ తెరదించింది. దీనివల్ల గత ఐదేళ్లతో పోలిస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రాలు నికరంగా రూ.4,66,150 కోట్ల ఆదాయం కోల్పోనున్నట్లు తేలింది.