అరవింద్ పనగడియా నేతృత్వంలోని 16వ ఆర్థిక సంఘం 2026-31 మధ్యకాలానికి రాష్ట్రాలకు పంపిణీ చేసే ఆర్థిక వనరులకు సంబంధించిన నివేదికను 2025, నవంబరు 17న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అందజేసింది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా దీనిని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. అప్పుడుగానీ రాష్ట్రాలకు ఎంత పన్నుల వాటా దక్కుతుందనే విషయం తెలియదు.
కొత్త సిఫార్సులు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2023 డిసెంబరు 31న 16వ ఆర్థిక సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2025 అక్టోబరు 31లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించింది. తర్వాత దాన్ని నెలరోజులపాటు పొడిగించింది.