2024 జనవరి నుంచి నవంబరు వరకు 15,547 కోట్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జరిగాయని, వీటి విలువ రూ.223 లక్షల కోట్లుగా నమోదైందని ఆర్థిక మంత్రిత్వశాఖ 2024, డిసెంబరు 14న వెల్లడించింది. భారత్‌కు సంబంధించిన డిజిటల్ చెల్లింపుల విప్లవం ఇతర దేశాలకు కూడా వేగంగా విస్తరిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం యూఏఈ, సింగపూర్, భూటాన్, నేపాల్, శ్రీలంక, ఫ్రాన్స్, మారిషస్ వంటి కీలక మార్కెట్లలో యూపీఐ పని చేస్తోంది.
* 2024, నవంబరులో 1,658 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదు కాగా, వీటి విలువ రూ.23.49 లక్షల కోట్లుగా ఉంది.