Published on Aug 31, 2024
Current Affairs
15 నెలల కనిష్ఠానికి జీడీపీ
15 నెలల కనిష్ఠానికి జీడీపీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) తొలి త్రైమాసికంలో దేశ వృద్ధి రేటు 15 నెలల కనిష్ఠమైన 6.7 శాతంగా నమోదైంది. 2023 జనవరి-మార్చి వృద్ధిరేటు 6.2% తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి. వ్యవసాయం, సేవల రంగాలు పెద్దగా రాణించకపోవడం ఇందుకు కారణం. 

* 2023-24 ఏప్రిల్‌-జూన్‌లో వృద్ధి రేటు 8.2% ఉంది. అయితే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ కొనసాగుతోంది. 2024 ఏప్రిల్‌-జూన్‌లో చైనా 4.7% వృద్ధి రేటునే నమోదు చేయడం ఇందుకు నేపథ్యం.