భారత సేవల రంగ వృద్ధి 2025, ఆగస్టులో 15 ఏళ్ల గరిష్ఠమైన 62.9 పాయింట్లకు చేరింది. గిరాకీ పరిస్థితులు మెరుగవడంతో, కొత్త ఆర్డర్లు పెరగడమే ఇందుకు కారణం. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ సూచీ గత నెలలో 62.9 పాయింట్లకు చేరింది. 2025, జులైలో ఇది 60.5 పాయింట్లుగా ఉంది.