Published on May 12, 2025
Current Affairs
14వ పోప్‌గా రాబర్ట్‌ ప్రివోస్ట్‌
14వ పోప్‌గా రాబర్ట్‌ ప్రివోస్ట్‌

అమెరికాకు చెందిన రాబర్ట్‌ ప్రివోస్ట్‌ (69 ఏళ్లు) తదుపరి పోప్‌గా ఎన్నుకున్నట్టు వాటికన్‌ వర్గాలు ప్రకటించాయి.

పోప్‌గా ఓ అమెరికన్‌ ఎన్నికకావడం ఇదే ప్రథమం. రాబర్ట్‌ ప్రివోస్ట్‌ను ఇకపై 14వ పోప్‌ లియోగా వ్యవహరిస్తారు. 

‘‘ఆర్డో రితూమ్‌ కాంక్లేవిస్‌’’ నిబంధనల ప్రకారం సంప్రదాయబద్ధంగా పోప్‌ ఎన్నిక పూర్తయిందని వాటికన్‌ వర్గాలు తెలిపాయి. 

అమెరికాలోని షికాగోకు చెందిన ప్రివోస్ట్‌ అంతర్జాతీయ అనుభవం కలిగిన వ్యక్తి. ఒక మతగురువుగా ఆయన సుదీర్ఘకాలం దక్షిణ అమెరికాలో పనిచేశారు. ఇటీవల బిషప్‌ నియామక బాధ్యతలు నిర్వహించారు.