Published on Mar 22, 2025
Current Affairs
100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి
100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇప్పటికే మనదేశం రికార్డు స్థాయిలో 1 బిలియన్‌ (100 కోట్ల) టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2025, మార్చి 21న పేర్కొన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో (2023-24) బొగ్గు ఉత్పత్తి 997.83 మిలియన్‌ టన్నులుగా (ఎమ్‌టీ) ఉంది. ఈసారి ఆర్థిక సంవత్సరం ముగియడానికి 11 రోజుల ముందే (ఈనెల 20న) బిలియన్‌ టన్నుల ఉత్పత్తి సాధించినట్లు బొగ్గు శాఖ పేర్కొంది. 

మనదేశ ఇంధన అవసరాల్లో 55% వరకు బొగ్గే ఆధారమవుతోంది. దేశ విద్యుదుత్పత్తిలో 74% బొగ్గు ఆధారిత  ప్లాంట్లలోనే జరుగుతోంది. 2024-25లో 1,080 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలన్నది బొగ్గు శాఖ ప్రణాళిక.