ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు తమదైన పరిష్కారం చూపుతున్న 25 మంది భారతీయ బాలలు 2024 డిసెంబరు 12న న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో తమ ప్రాజెక్టుల గురించి వివరించారు.
సమితి గుర్తింపు ఉన్న 1ఎం1బి సంస్థ నిర్వహిస్తున్న ఎనిమిదో వార్షిక శిఖరాగ్ర సదస్సులో వారు పాల్గొన్నారు.
వీరిలో హైదరాబాద్‌కు చెందిన 14 ఏళ్ల సిద్ధార్థ్ మన్నేపల్లి కూడా ఉన్నాడు.
అతడు బడుగు వర్గాలకు విద్యను అందించడానికి ఎడ్యుటెక్ సంస్థను నడుపుతున్నాడు.