గంటకు 280 కి.మీ. వేగంతో వెళ్లేలా హైస్పీడ్ రైళ్లను చెన్నైలోని ‘సమీకృత రైలుపెట్టెల తయారీ కర్మాగారం’ (ఐసీఎఫ్)లో సిద్ధం చేయిస్తున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 2024, నవంబరు 27న వెల్లడించారు.
ఒక్కో పెట్టె తయారీకి సుమారు రూ.28 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.
మేక్ ఇన్ ఇండియా (భారత్‌లో తయారీ) కింద తీసుకువచ్చిన వందేభారత్ రైళ్లు విజయవంతం కావడంతో ఇప్పుడు హైస్పీడ్ రైళ్ల రూపకల్పన, తయారీపై రైల్వేశాఖ దృష్టి సారించింది.