Published on Dec 3, 2025
Current Affairs
హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌
హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌
  • యుద్ధవిమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు దాని నుంచి బయటపడేందుకు పైలట్‌కు సహాయపడే ఎస్కేప్‌ వ్యవస్థను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) విజయవంతంగా పరీక్షించింది. పైలట్‌ను క్షేమంగా వెలుపలికి తీసుకురావడం సహా భద్రతకు సంబంధించిన కీలక అంశాలను ఈ సందర్భంగా ధ్రువీకరించుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో సొంతంగా ఇలాంటి పరీక్ష సామర్థ్యాన్ని కలిగిన అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరింది. 
  • హైస్పీడ్‌ రాకెట్‌ స్లెడ్‌ టెస్ట్‌ అనే ఈ పరీక్షను చండీగఢ్‌లో డీఆర్‌డీవోకు చెందిన టెర్మినల్‌ బాలిస్టిక్స్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ (టీబీఆర్‌ఎల్‌)లో నిర్వహించారు. ఇందులో తేజస్‌ యుద్ధవిమానానికి సంబంధించిన ముందు భాగాన్ని ఉపయోగించారు.