Published on Sep 27, 2024
Government Jobs
హెవీ వెహికిల్‌ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ ఖాళీలు
హెవీ వెహికిల్‌ ఫ్యాక్టరీలో టెక్నీషియన్ ఖాళీలు

ఆర్మ్‌ర్డ్ వెహికిల్స్‌ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్‌)కు చెందిన చెన్నై, ఆవడిలోని హెవీ వెహికిల్‌ ఫ్యాక్టరీ (హెచ్‌వీఎఫ్‌) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 271

వివ‌రాలు:

1. జూనియర్ మేనేజర్: 02

2. డిప్లొమా టెక్నీషియన్: 09

3. జూనియర్ టెక్నీషియన్: 259

4. అసిస్టెంట్: 01

విభాగాలు: డిజైన్, సివిల్, క్వాలిటీ అండ్ ఇన్‌స్పెక్షన్, బ్లాక్‌స్మిత్‌, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఎలక్ట్రానిక్స్‌, మెషినిస్ట్, రిగ్గర్, వెల్డర్‌, లీగల్, పెయింటర్, ఫిట్టర్ ఆటో ఎలక్ట్రిక్, మిల్‌ వెయిట్.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీ, పీజీ (ఎంటెక్/ ఎల్ఎల్‌బీ) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఎన్ఏసీ/ఎన్‌టీసీ సర్టిఫికేషన్‌ తప్పనిసరి.

జీతం: నెలకు జూనియర్ మేనేజర్ పోస్టులకు రూ.30,000; జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు రూ.21,000; మిగతా పోస్టులకు రూ.23,000.

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.300; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ / మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్, ట్రేడ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది చీఫ్ జనరల్ మనేజర్‌,  హెవీ వెహికిల్స్‌ ఫ్యాక్టరీ, అవడి, చెన్నై’ చిరునామాకు పంపాలి.

చివరి తేదీ: 9-10-2024.

Website:https://avnl.co.in/