ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 359.79 మిలియన్ టన్నుల 25 హెవీ మినరల్ డిపాజిట్లు ఉన్నట్లు కేంద్ర శాస్త్ర సాంకేతిక వ్యవహారాలశాఖ మంత్రి జితేంద్రసింగ్ 2026, మార్చి 11న లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఇల్మెనైట్ 178.75 మిలియన్ టన్నులు, రూటిల్ 11.46, లూకోక్సిన్ 3.64, మోనజైట్ 4.05, జిర్కాన్ 12.75, గార్నెట్ 67.30, సిలిమనైట్ 81.85 మిలియన్ టన్నుల నిల్వలు రాష్ట్రంలో ఉన్నట్లు వివరించారు.