భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మహారత్న సంస్థ అయిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్), ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ డివిజన్ (టీఏడీ), కాన్పూర్ సంస్థ 2026 సంవత్సరానికి అప్రెంటిస్ శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వాస్తోంది.
వివరాలు:
ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
ఇంటర్మీడియట్ వోకేషనల్ (10+2) అప్రెంటిస్
విభాగాలు: ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, వెల్డర్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, డ్రాట్స్‌మ్యాన్, ప్రింటర్, కార్పెంటర్, ఆటోమొబైల్, అకౌంటెన్సీ, స్టెనో, హెల్త్ వర్కర్, ఆడియో విజువల్ తదితరాలు.
అర్హత: అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఇంటర్మీడియట్ వోకేషనల్ (10+2) పూర్తి చేసి ఉండాలి. తప్పనిసరిగా అప్రెంటిస్‌షిప్ ఇండియా (Apprenticeship India) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చివరి తేదీ: 30-01-2026.
Website:https://hal-india.co.in/career