Published on Mar 21, 2025
Government Jobs
హాల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు
హాల్‌లో టెక్నీషియన్‌ పోస్టులు

బెంగళూరులోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 09

వివరాలు:

టెక్నీషియన్‌ (మెకానికల్‌): 06

సివిల్‌: 01

అకౌంట్స్‌: 01

స్టోర్స్‌ క్లరికల్‌/ కమర్షియల్‌ అసిస్టెంట్‌/ అడ్మిన్‌ అసిస్టెంట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీకాం, బీఏ, బీఎస్సీ/బీబీఏ/బీసీఏ/ బీఎస్‌డబ్ల్యూ ఉత్తీర్ణతతో పాటు టైపింగ్‌ స్కిల్స్‌ ఉండాలి.   

వయోపరిమితి: 01.03.2025 నాటికి 28 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, హెలీక్యాప్టర్‌ డివిజన్‌, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌, బెంగళూరు చిరునామాకు స్పీడ్‌ పోస్ట్‌/ రిజిస్టర్‌/ కొరియర్‌ ద్వారా పంపించాలి.

దరఖాస్తు చివరి తేదీ: 05.04.2025.

Website:https://hal-india.co.in/home