Published on Mar 24, 2025
Current Affairs
హోల్బర్గ్‌ ప్రైజ్‌-25
హోల్బర్గ్‌ ప్రైజ్‌-25

కోల్‌కతాకు చెందిన గాయత్రీ చక్రవర్తికి (82 ఏళ్లు) ప్రతిష్ఠాత్మకమైన ‘హోల్బర్గ్‌ ప్రైజ్‌-25’ దక్కింది.

దీన్ని నోటెల్‌తో సమానంగా భావిస్తారు.

ఆమె ప్రముఖ సాహితీ విమర్శకురాలు. తులనాత్మక సాహిత్యం, అనువాదం, అధ్యయనాలు, రాజకీయ తత్వశాస్త్రంసహా స్త్రీవాద సిద్ధాంతంలో గాయత్రి చేసిన విప్లవాత్మక ఇంటర్‌ డిసిప్లినరీ పరిశోధనలు ఆమెకు ఈ గౌరవం దక్కేలా చేశాయి. 

నార్వే ప్రభుత్వం నుంచి జూన్‌ 5న ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. దీంతోపాటు రూ.4.6 కోట్ల నగదు బహుమతీ ఆమెకు లభిస్తుంది.