ప్రపంచంలోనే ఎక్కువ మంది బిలియనీర్లు (కుబేరులు) ఉండే అగ్రగామి 10 నగరాల్లో భారత్ నుంచి ముంబయి, దిల్లీ చోటు దక్కించుకున్నాయని హురున్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక తెలిపింది. దేశ ఆర్థిక వృద్ధికి ఊతంగా నిలుస్తున్న ఈ నగరాలు, ప్రపంచవ్యాప్త బిలియనీర్ల పటంలోనూ చోటు దక్కించుకోగలిగాయి. కనీసం బిలియన్ డాలర్ల (సుమారు రూ.8800 కోట్లు) సంపద కలిగిన వ్యక్తులు న్యూయార్క్‌లో 119 మంది ఉండడంతో, ఈ జాబితాలో అగ్రస్థానం దక్కింది.