ప్రవాస భారతీయ (ఎన్నారై) బిలియనీర్లు అంతర్జాతీయంగా 101 మంది ఉన్నారని ‘హురున్ రిచ్ లిస్ట్-2025’ వెల్లడించింది.
ఇందులో 48 మంది అమెరికాలో, 22 మంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో, బ్రిటన్‌లో 16 మంది, సైప్రస్ - సింగపూర్‌లలో ముగ్గురు చొప్పున ఉన్నారు.
ప్రవాస భారతీయ కుబేరుల్లో రూ.1.85 లక్షల కోట్లతో హిందుజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ హిందుజా అగ్రస్థానంలో నిలిచారు.
రెండో స్థానంలో యార్సెలర్ మిత్తల్ అధిపతి లక్ష్మీ ఎన్ మిత్తల్ ఉన్నారు.
వీరిద్దరూ లండన్‌లో ఉంటున్నారు.
స్కాలర్ వ్యవస్థాపకుడు జయ్ చౌధ్రీ 3వ ర్యాంక్‌లో ఉన్నారు.
భారత్‌లో అత్యంత ధనవంతురాలైన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఉన్న జయశ్రీ ఉల్లాల్ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచారు.