- అత్యవసర నిబంధనల కింద అదనంగా హెరాన్ మార్క్-2 డ్రోన్లను కొనుగోలు చేయడానికి భారత్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ సిందూర్ భారత సైనిక దళాలకు ఇవి బాగా ఉపయోగపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.
- హెరాన్ మార్క్-2 డ్రోన్లు ఇప్పటికే భారత సైన్యం, వాయుసేన అమ్ములపొదిలో ఉన్నాయి. ఇప్పుడు వాటిని నౌకాదళంలోనూ ప్రవేశపెట్టబోతున్నట్లు ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ పేర్కొంది.