Published on Jan 22, 2025
Current Affairs
హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌-2024
హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌-2024

భారత దేశానికి వెలుపల రాణిస్తున్న భారతీయ సంతతి వ్యక్తుల జాబితాలో మైక్రోసాఫ్ట్‌ ఛైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల అగ్రస్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానంలో సుందర్‌ పిచాయ్, నీల్‌ మోహన్‌ తదితరులున్నారు.

తొలిసారిగా రూపొందించిన హెచ్‌ఎస్‌బీసీ హురున్‌ గ్లోబల్‌ ఇండియన్స్‌ లిస్ట్‌-2024 ఈ విషయాలను వెల్లడించింది. ప్రపంచంలో భారతీయ మూలాలున్న వ్యక్తుల ఆధ్వర్యంలో నడుస్తున్న అగ్రగామి 200 కంపెనీల జాబితాను హురున్‌ ప్రకటించింది.

కనీసం 1 బిలియన్‌ డాలర్ల (రూ.8600 కోట్లకు పైగా) మార్కెట్‌ విలువ ఉన్న కంపెనీలను ఇందుకు పరిగణనలోకి తీసుకుంది.  ఈ కంపెనీలన్నిటి మార్కెట్‌ విలువ కలిపితే 10 లక్షల కోట్ల డాలర్లకు దరిదాపుల్లో నిలిచింది.

ఈ 200 సంస్థలకు 226 మంది సీఈఓలు, ఎండీలు, వ్యవస్థాపకులు ఉన్నారు. వీరంతా భారత్‌ వెలుపల ఉన్న భారతీయ సంతతి వ్యక్తులే.