Published on Aug 30, 2024
Current Affairs
‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2024’
‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2024’

‘హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌-2024’ ప్రకారం దేశంలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా గౌతమ్‌ అదానీ నిలిచారు. అదానీ నికర సంపద విలువ ఏడాదికాలంలో 95% పెరిగి, రూ.11.6 లక్షల కోట్లకు చేరడమే ఇందుకు కారణం. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ నికర విలువ 25% వృద్ధితో రూ.10.14 లక్షల కోట్లకు చేరడంతో, ఆయన రెండో స్థానానికి పరిమితమయ్యారు. 

* హెచ్‌సీఎల్‌కు చెందిన శివ్‌ నాడార్‌ కుటుంబం రూ.3.14 లక్షల కోట్లతో మూడో స్థానంలోకి చేరింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా అధిపతి సైరస్‌ పూనావాలా రూ.2.89 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో, దిలీప్‌ సంఘ్వి రూ.2.50 లక్షల కోట్లతో అయిదో స్థానంలో ఉన్నారు.