దేశీయ యూనికార్న్ (100 కోట్ల డాలర్లు/రూ.8800 కోట్ల) సంస్థల జాబితాలోకి తాజాగా 11 కొత్త అంకురాలు చేరాయి.
దీంతో దేశంలోని మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 73కు చేరిందని ‘ఏఎస్‌కే ప్రైవేట్‌వెల్త్ హురున్ ఇండియా యూనికార్న్ అండ్ ఫ్యూచర్ యూనికార్న్ రిపోర్ట్ 2025’ పేర్కొంది.
ఆ పదకొండు సంస్థలు: ఏఐ.టెక్, నవీ టెక్నాలజీస్, ర్యాపిడో, నెట్రాడైన్, జంబోటెయిల్, డార్విన్‌బాక్స్, వివ్రితి క్యాపిటల్, వెరిటాస్ ఫైనాన్స్, మనీవ్యూ, జస్‌పే, డ్రూల్స్.
దేశంలో అత్యంత విలువైన యూనికార్న్‌గా జెరోధా (8.2 బి. డాలర్లు) నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో రాజోర్‌పే, లెన్స్‌కార్ట్ (7.5 బి. డాలర్లు), గ్రో (7 బి. డాలర్లు) ఉన్నాయి.
దేశంలోని యూనికార్న్‌లన్నీ కలిసి 2,06,000 మందికి ఉపాధినిస్తున్నాయి.
లెన్స్‌కార్ట్, ఆఫ్‌బిజినెస్, ఫిజిక్స్‌వాలా కంపెనీలు ఉద్యోగుల పరంగా ముందున్నాయి.
200 మి. డాలర్లకు పైగా విలువ ఉన్న అంకురాలు మొత్తం మీద 3.74 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.