Published on Sep 27, 2024
Current Affairs
హురున్‌ అండర్‌ 35 జాబితా
హురున్‌ అండర్‌ 35 జాబితా

దేశవ్యాప్తంగా 35 ఏళ్లలోపు వయస్సులోనే విశేష ప్రతిభ చూపుతున్న 150 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తల జాబితాను ‘హురున్‌ అండర్‌ 35 జాబితా’ పేరుతో హురున్‌ ఇండియా విడుదల చేసింది. రిలయన్స్‌ రిటైల్‌కు నేతృత్వం వహిస్తున్న ఈశా అంబానీ (32) ఈ జాబితాలో అత్యంత తక్కువ వయసున్న మహిళగా నిలిచారు.  షేర్‌చాట్‌ ప్రతినిధి అంకుష్‌ సచ్‌దేవ (31) అందరి కంటే పిన్నవయస్కుడు కావడంతో జాబితా అగ్రస్థానంలో నిలిచారు. ఈశా అంబానీ 31వ స్థానంలో ఉండగా, ఆమె కవల సోదరుడు, జియో ఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ 32వ స్థానంలో ఉన్నారు.

ఇందులో 60 మంది వివిధ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)ల్లో చదివినవారే కావడం విశేషం. అత్యధికంగా ఐఐటీ మద్రాస్‌ నుంచి 13 మంది ఉన్నారు. ఐఐటీ బాంబే(11), ఐఐటీ దిల్లీ(10), ఐఐటీ ఖరగ్‌పూర్‌(10), ఐఐటీ రూర్కీ(6) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.