హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో వినూత్న ఆవిష్కరణలకు మద్దతుగా నిలిచే అంకురాల కోసం రూ.100 కోట్ల పథకాన్ని ప్రారంభించినట్లు కొత్త, పునరుత్పాదక ఇంధన మంత్రి ప్రహ్లాద్ జోషి 2025, సెప్టెంబరు 11న వెల్లడించారు. వినూత్నంగా హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, రవాణా, వినియోగ సాంకేతికతలను చేపట్టే ప్రాజెక్టులకు ఒక్కో దానికి రూ.5 కోట్లు అందించనున్నట్లు తెలిపారు.