హొమి బాబా క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నం తాత్కాలిక ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మెడికల్, నాన్‌మెడికల్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 13
వివరాలు:
విభాగాలు: పాథాలజీ, అనస్థీషియాలజీ, డెంటల్ అండ్ ప్రొస్థెటిక్స్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ, న్యూక్లీయర్ మెడిసిన్, రేడియోడయాగ్నోసిస్, గైనిక్ ఆంకాలజీ.
1. కన్సల్టెంట్ (డీ/ఈ/ఎఫ్): 08
2. అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్: 01
3. ఆఫీసర్ ఇన్‌ఛార్జి(డిస్పెన్షరీ): 01
4. సైంటిఫిక్ అసిస్టెంట్ సీ(న్యూక్లియర్ మెడిసిన్): 01
5. ఫార్మసిస్ట్ బీ: 01
6. నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్-1: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, పీహెచ్‌డీ (నర్సింగ్), బీ ఫార్మ్ లేదా డీ ఫార్మ్, బీఎస్సీ, ఎంబీబీఎస్ తేదా బీడీఎస్, ఎండీ/డీఎన్‌బీ, ఎండీఎస్, డీఎం, ఎంసీహెచ్, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 ఆగస్టు 21వ తేదీ నాటికి కన్సల్టెంట్, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్, ఆఫీస్ ఇన్‌ఛార్జి, నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు 40 నుంచి 50 ఏళ్లు, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు 35 ఏళ్లు, ఫార్మసిస్ట్-బీకి 30 ఏళ్లు,
జీతం: నెలకు ఫార్మసిస్ట్-బీ పోస్టుకు రూ.29,200, సైంటిఫిక్ అసిస్టెంట్‌కు రూ.44,900, ఆఫీసర్ ఇన్‌ఛార్జికి రూ.56,100, కన్సల్టెంట్, నర్సింగ్ సూపరింటెండెంట్‌కు రూ.67,700 - రూ.1,23,100.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 ఆగస్టు 21.
Website:https://tmc.gov.in/m_events/events/JobDetail?jobId=35859