Published on Jul 4, 2025
Walkins
హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఉద్యోగాలు
హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

హొమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ & రిసెర్చ్‌ సెంటర్‌, బిహార్‌ మెడికల్ ఫిజిసిస్ట్‌ పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 39

వివరాలు:

1. కన్సల్టెంట్‌: 07

2. మెడికల్ ఆఫీసర్‌: 02

3. నర్స్‌: 20

4. ఎంటీఎస్‌: 03

5. ఫార్మసిస్ట్‌: 07

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా(ఫార్మసీ), పదో తరగతి, జీఎన్‌ఎం/బీఎస్సీ నర్సింగ్‌, ఎంబీబీఎస్‌, డీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 2025 జులై 15వ తేదీ నాటికి కన్సల్టెంట్‌, మెడికల్ ఆఫీసర్‌కు 45 ఏళ్లు, నర్స్‌, ఎంటీఎస్‌, ఫార్మసిస్ట్‌కు 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు కన్సల్టెంట్‌కు రూ.1,00,000 - రూ.1,40,000, మెడికల్‌ ఆఫీసర్‌కు రూ.84,000 - రూ.1,00,000, నర్స్‌కు రూ.18,000 - రూ.22,000, ఎంటీఎస్‌కు రూ.10,000 - రూ.15,000, ఫార్మసిస్ట్‌కు రూ.20,000 - రూ.22,000.

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీ: జులై 10, 11, 14, 15.

వేదిక: హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌, శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్‌ అండ్‌ హాస్పిటల్‌ క్యాంపస్‌, ఉమానగర్‌, ముజఫ్ఫర్‌పూర్‌(బిహార్‌)-842004.

Website:https://tmc.gov.in/m_events/events/JobDetail?jobId=35648