Published on Nov 18, 2024
Current Affairs
హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం
హైపర్‌సోనిక్‌ క్షిపణి ప్రయోగం

భారత్‌ 2024, నవంబరు 17న తొలిసారిగా దీర్ఘశ్రేణి హైపర్‌సోనిక్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. గగనతల రక్షణ వ్యవస్థలను బోల్తా కొట్టిస్తూ శత్రువుపై ప్రచండ వేగంతో దాడి చేయడం ఈ అస్త్రం ప్రత్యేకత. దీన్ని ఒడిశా తీరానికి చేరువలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి పరీక్షించారు. 

దీంతో ఈ సామర్థ్యమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన మన దేశం చేరింది. ఈ హైపర్‌సోనిక్‌ క్షిపణి 1,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.

ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ క్షిపణి కాంప్లెక్స్‌తోపాటు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ల్యాబ్‌లు, పరిశ్రమలు రూపొందించాయి.