ఆంధ్రప్రదేశ్‌లో వన్యప్రాణులు, ప్రజల మధ్య సంఘర్షణను నియంత్రించేందుకు అమలు చేయనున్న హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ నర్సింగ్ వైల్డ్‌లైఫ్ (హనుమాన్) ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది. దీనికి ‘ఆంధ్రప్రదేశ్ హ్యూమన్-వైల్డ్‌లైఫ్ కాన్‌ఫ్లిక్ట్ మిటిగేషన్ ఫౌండేషన్’ అని నామకరణం చేసింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ఛైర్‌పర్సన్‌గా అటవీ శాఖ కార్యదర్శి, పీసీసీఎఫ్ సహా మొత్తం 18 మంది సభ్యులతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది. సొసైటీల చట్టం కింద రిజిస్ట్రేషన్‌కు అనుమతిచ్చింది. ఈ మేరకు అటవీ శాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే 2025, డిసెంబరు 17న ఉత్తర్వులు జారీ చేశారు.