ప్రతి సంవత్సరం అక్టోబరు నెలను హిందూ మాసంగా జరుపుకొనేందుకు ఉద్దేశించిన బిల్లుకు అమెరికాలోని ఒహాయో స్టేట్ హౌస్, సెనేట్‌లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి.
అక్టోబరు నెలను హిందూ వారసత్వ మాసంగా జరుపుకోవాలని ప్రతిపాదిస్తూ ఆ రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంతానీ బిల్లు ప్రవేశపెట్టారు.
ఒహాయో చరిత్రలోనే తొలి హిందూ, భారతీయ అమెరికన్ స్టేట్ సెనేటర్‌గా అంతానీ గుర్తింపు పొందారు.
అంతేకాకుండా స్టేట్ లేదా సమాఖ్యకు ఎన్నికైన అత్యంత పిన్నవయస్కుడైన హిందూ, భారతీయ అమెరికన్‌గా కూడా ఆయన చరిత్ర సృష్టించారు.