ఐక్యరాజ్య సమితి నుంచి హిందీలో వార్తలను ప్రసారం చేయడంతోపాటు భాషను మరింత మందికి చేర్చే ప్రాజెక్టు పొడిగింపుపై మరోసారి ఒప్పందం కుదిరింది.
దీనిపై ఐరాసలో భారత ప్రతినిధి పి.హరీశ్, సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సెక్రటరీ జనరల్ మెలిసా ఫ్లెమింగ్ 2025, ఫిబ్రవరి 27న సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం 2025 ఏప్రిల్ 1 నుంచి 2030 మార్చి 31 వరకూ అమల్లో ఉంటుంది.