Published on Oct 1, 2024
Government Jobs
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఖాళీలు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌)కు చెందిన రోటరీ వింగ్ అకాడమీ - హెలికాప్టర్ డివిజన్, బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 04

వివ‌రాలు:

1. ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌: 02

2. టెక్నికల్ ట్రేడ్స్‌మ్యాన్: 01

3. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ/ఎంబీఏ ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌ పోస్టులకు రూ.1,64,560; అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు రూ.82,280; టెక్నికల్ ట్రేడ్స్‌మ్యాన్ రూ. 43,054.

దరఖాస్తు ఫీజు: ఫ్లైయింగ్ ఇన్‌స్ట్రక్టర్స్‌, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులకు రూ.500; టెక్నికల్ ట్రేడ్స్‌మ్యాన్ పోస్టులకు రూ.200.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ ది డిప్యూటీ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్), హెలికాప్టర్ డివిజన్, హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్, పోస్ట్‌ బాక్సు నెంబర్-1790, విమనపుర పోస్ట్‌, బెంగళూరు’ చిరునామాకు పంపించాలి.

ఆఫ్‌లైన్ దరఖాస్తులను పంపాల్సిన చివరి తేదీ: 12-10-2024.

Website:https://hal-india.co.in/home