Published on Sep 23, 2024
Government Jobs
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఆపరేటర్ ఖాళీలు
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో ఆపరేటర్ ఖాళీలు

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కోర్వా, అమేథీలోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన ఆపరేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 81

వివ‌రాలు:

విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఫిట్టింగ్, కెమికల్, టర్నింగ్, ల్యాబ్, ఎలక్ట్రోప్లేటింగ్, వెల్డింగ్.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీబీఏ) ఉత్తీర్ణత ఉండాలి.  

వయోపరిమితి: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.22,000-రూ.23,000

దరఖాస్తు ఫీజు: రూ.200. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 05-10-2024.

Website:https://hal-india.co.in/home