Published on Oct 4, 2024
Government Jobs
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో మేనేజీరియల్ పోస్టులు
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో మేనేజీరియల్ పోస్టులు

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్ (హెచ్ఏఎల్‌), బెంగళూరు ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టుల‌ సంఖ్య: 44

వివ‌రాలు:

1. డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7): 01

2. మేనేజర్ (గ్రేడ్-4): 04

3. డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-3): 25

4. ఆఫీసర్ (గ్రేడ్-2): 14

విభాగాలు: ఫైనాన్స్‌, ఫైర్, ఫ్లైట్ ఆపరేషన్ అండ్ సేఫ్టీ, హెచ్ఆర్, పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియా కమ్యూనికేషన్, కంపెనీ సెక్రటరీ, ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ/ఐసీడబ్ల్యూఏ డిగ్రీ (బీఎస్సీ), ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టులకు 30 ఏళ్లు; డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-3) పోస్టులకు 35 ఏళ్లు; మేనేజర్ (గ్రేడ్-4) పోస్టులకు 38 ఏళ్లు;  డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7) పోస్టులకు 47 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు ఆఫీసర్ (గ్రేడ్-2) పోస్టులకు రూ.40,000-రూ.1,40,000; డిప్యూటీ మేనేజర్ (గ్రేడ్-3) పోస్టులకు రూ.50,000-రూ.1,60,000; మేనేజర్ (గ్రేడ్-4) పోస్టులకు రూ.60,000-రూ.1,80,000; డిప్యూటీ జనరల్ మేనేజర్ (గ్రేడ్-7) పోస్టులకు రూ.90,000-రూ.2,40,000.

దరఖాస్తు ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్‌ టెస్ట్‌, పని అనుభవం, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుల‌కు చివరి తేదీ: 30-10-2024.

Website:https://hal-india.co.in/home