హిందుస్థాన్ ఉర్వరక్ రసాయన్ లిమిటెడ్ (హెచ్‌యూఆర్‌ఎల్) వివిధ విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
వివరాలు:
1. వైస్ ప్రెసిడెంట్: 03
2. అడిషనల్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్: 01
3. డిప్యూటీ మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్: 03
4. సీనియర్ ఇంజినీర్/ఇంజినీర్: 10
5. అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్: 11
6. అసిస్టెంట్ మేనేజర్/డిప్యూటీ మేనేజర్/మేనేజర్: 03
7. డిప్యూటీ మేనేజర్/మేనేజర్/సీనియర్ మేనేజర్: 02
8. ఆఫీసర్: 01
9. మేనేజర్: 01
10. సీనియర్ మేనేజర్/ఎఫ్‌టీసీ: 01
11. మేనేజర్/ఎఫ్‌టీసీ: 01
12. ఆఫీసర్/ఎఫ్‌టీసీ: 03
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్, సీఏ లేదా సీఎంఏలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 నుంచి 42 ఏళ్లు.
జీతం: నెలకు వైస్‌ప్రెసిడెంట్‌కు రూ.1,20,000 - రూ.2,80,000, అడిషనల్ చీఫ్ మేనేజర్‌కు రూ.90,000 - రూ.2,40,000, సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 - రూ.2,20,000, మేనేజర్‌కు రూ.70,000 - రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000 - రూ.1,80,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 - రూ.1,60,000, సీనియర్ ఇంజినీర్‌కు రూ.45,000 - రూ.1,50,000, ఇంజినీర్/ఆఫీసర్‌కు రూ.40,000 - రూ.1,40,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 ఆగస్టు 12.